ఐదేళ్లలోనే ధవళేశ్వరం బ్యారేజీ పూర్తి

77చూసినవారు
ఐదేళ్లలోనే ధవళేశ్వరం బ్యారేజీ పూర్తి
ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో ఆర్థర్ కాటన్ పట్టుదల చూపారు. 1847లో ధవళేశ్వరం నిర్మాణానికి ఆరుగురు ఇంజినీర్లు, 8 మంది జూనియర్లు, 2వేల మంది మేస్త్రీలను అడిగితే ఒక యువ ఇంజినీరు, ఇద్దరు సర్వేయర్లు, కొంతమంది మేస్త్రీలను అప్పగించి చేయమన్నారు. పట్టుదలతో ఆ కొద్దిమందితోనే రంగంలోకి దిగారు. 1848లో అనారోగ్యంతో ఆస్ట్రేలియా వెళ్లి, రెండేళ్లలో తిరిగి వచ్చారు. కుమార్తె పాము కాటుతో మరణించినా, కుంగిపోకుండా 1852 నాటికి బ్యారేజిని పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్