ధవళేశ్వరం పాత ఆనకట్ట వరదలతో దెబ్బతినడంతో 1970లో కొత్త బ్యారేజ్ నిర్మించారు. 1978లో ప్రస్తుతం ఉన్న బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. 1852లో పూర్తైన ఆనకట్ట పడవ రవాణా, సాగునీటి కోసం ఉపయోగపడింది. అదనంగా సాగునీటి అవసరాల కోసం 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల మేర పెంచారు. 1897-99లలో సిమెంటు కాంక్రీటు వినియోగించి మరో తొమ్మిది అంగుళాలు, 1936లో మూడు అడుగుల చొప్పున ఎత్తు ఉండే తలుపులు అమర్చి, పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు.