ప్రేక్షకులను ప్రతి బుధవారం, గురువారం అలరిస్తున్న డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ జోడీ’ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ గ్రాండ్ ఎపిసోడ్‌కు హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు టైటిల్‌ను అందించనున్నారు. ఈనెల 18, 19 తేదీల్లో ఫైనల్ ఎపిసోడ్లు ప్రసారం కానుండగా, వాటికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ముగింపు ఎపిసోడ్‌ను చూసేందుకు డ్యాన్స్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.