లండన్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అతను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కొత్తగా ప్రకటించిన ఏడుగురు జాబితాలో ధోనితో పాటు మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ధోని స్పందిస్తూ, “ఇది గొప్ప గౌరవం. దిగ్గజాలతో పాటు నా పేరును గుర్తుంచుకోవడం అనుభూతినిచ్చే విషయం" అని చెప్పారు.