ఇటీవల జరిగిన IPL 2025 మ్యాచ్‌లో MS ధోనీ తన ప్రవర్తనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. లక్నోతో జరిగిన IPL మ్యాచ్ సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చిన రోబో డాగ్‌ను ధోనీ నవ్వుతూ ఎత్తి కిందపడేశారు. ఆ రోబో కదలలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. వయసు పెరిగినా ధోనిలో కొంటెతనం పోలేదని అంటున్నారు. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.