చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ మహిళా అభిమాని కోసం ధోనీ చూపిన ఆత్మీయత నెట్టింట వైరల్‌గా మారింది. వీల్‌చైర్‌లో ఉన్న ఆ మహిళ ధోనీని చూసి సెల్ఫీ కోరగా, ఆయన ఆమె వద్దకు వెళ్లి సరదాగా సెల్ఫీ ఇచ్చారు. ఈ క్షణాన్ని ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ధోనీపై ఎంతో పొగడ్తలు కురిపిస్తున్నారు.