టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బైకులు, కార్లు అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. వాటిని ఉంచేందుకు ఆయన ఏకంగా రెండంతస్తుల గ్యారేజ్‌ను నిర్మించారు. అప్పుడప్పుడూ వాటిపై బయటికొచ్చి షికారు చేస్తుంటారు కూడా. తాజాగా తన యమహా ఆర్1-జెడ్‌తో ఆయన రాంచీ రోడ్డుపై విహరించారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.