జొన్నగిరిలో వజ్రాల వేట (వీడియో)

52చూసినవారు
AP: తొలకరి వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, కృష్ణా జిల్లా గుడిమెట్లలో ఆదివారం వజ్రాల కోసం వేట ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు అక్కడికి వచ్చి పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. భోజనం క్యారేజీలు వెంట తెచ్చుకుని మరీ అన్వేషిస్తున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో పొలాలను జల్లెడ పడుతున్నారు. వజ్రం దొరికాకే ఇళ్లకు వెళ్తామని చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్