గన్నవరంలో పలువురిపై దాడులు జరిగినా.. జగన్ ఏనాడైనా స్పందించారా? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా సమీక్ష చేసుకోకపోతే ఆ పార్టీ మరింత నష్టపోతుందని హితవు పలికారు. దాడులు చేసేవారిని, బూతులు తిట్టేవారిని ప్రోత్సహించింది మీరు కాదా అంటూ మండిపడ్డారు. జగన్ మీడియా ముందుకొచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, లేనిపోని అవాస్తవాలు జోడించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.