అమర్నాథ్ యాత్ర భద్రత కోసం సైనికులను తరలించేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా పంపిన రైలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో చినిగిపోయిన బెడ్‌లు పనిచేయని ఫ్యాన్‌ల్, క్లీన్‌గా లేని టాయిలెట్స్, చెత్తతో నిండిన భోగీలు దర్శనమిస్తున్నాయి. ఈ రైలు అస్సలు బాగోలేదంటూ సైనికులు చెప్తున్నారు. భద్రత కోసం వెళ్తున్న తమకు కనీస సదుపాయాలు లేవంటున్నారు. రైల్వే శాఖపై నెటిజన్ల్‌లు ఫైర్ అవుతున్నారు.