పసిడి భూగోళంలో ఉద్భవించిన లోహం కాదు. 200 మిలియన్ సంవత్సరాల క్రితం భారీ ఉల్కలు భూమిని ఢీకొట్టిన ఫలితంగా వచ్చింది. స్వర్ణానికి సన్నగా సాగే గుణం ఉంటుంది. అందుకే రోడియం, ప్లాటినం తదితర విలువైన, అరుదైన లోహాలున్నా కనకానికే క్రేజ్ ఎక్కువ. 28.3 గ్రాముల బంగారాన్ని సన్నటి తీగలా సాగదీస్తే 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. స్వచ్ఛమైన స్వర్ణం ఎంతమాత్రమూ విషపూరితం కాదు. మన జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. తుప్పుపట్టని లోహాల్లో ఇదొకటి.