పీవీ సింధు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

45చూసినవారు
పీవీ సింధు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పీవీ సింధు తల్లిదండ్రులు ఇద్దరూ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. ఆమె తండ్రి 2000లో అర్జున అవార్డు పొందారు. ఆమె ఎనిమిదేళ్ల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. ఆమె పుల్లెల గోపీచంద్ శిక్షణలో ఎదిగింది. సింధు 2016 రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి, ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్