రాజ్యసభ ఎంపీ..సామాజిక సేవలో గుర్తింపు దక్కించుకున్న గొప్ప వ్యక్తి సుధా మూర్తి..గత 30 ఏళ్ల నుంచి ఒక్క చీర కూడా కొనలేదని షాకింగ్ నిజాలు చెప్పింది. తనకు ఉన్న చీరలనే మళ్లీ మళ్లీ కట్టకుంటానని తెలిపింది. కాశీలో పుణ్యస్నానం ఆచరించి.. మనకు ఇష్టమైనవి వదిలేస్తే అంతా శుభం జరుగుతుందని పెద్దలు చెప్తే నమ్మిందట. దీంతో ఆమెకు ఇష్టమైన షాపింగ్‌ను వదిలేసిందని పేర్కొంది. ఎవరైనా చీరలను గిఫ్ట్స్ గా ఇస్తే వాటినే కట్టుకుంటానని వెల్లడించారు.