త్వరలోనే పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు: మంత్రి లోకేష్

50చూసినవారు
త్వరలోనే పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు: మంత్రి లోకేష్
AP: మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా ఐటీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ గురించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు వాట్సాప్‌లోనే అన్ని ధృవ‌ప‌త్రాలు అందిస్తామని.. అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కావాలన్నారు. క్యూఆర్ కోడ్ తోనే పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేసి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్