TS: హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై చర్చిస్తున్నారు. థియేటర్ల లైసెన్స్ లు పునరుద్ధరణ సులువుగా ఉండాలన్న అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దిల్ రాజుతోపాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.