పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'హరిహర వీరమల్లు' సినిమాలో ఆరు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒక ఫైట్ సీన్ 20 నిమిషాలు కొనసాగనుందని, ఈ ఫైట్ 61 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు తెలిపారు. కాగా, ఈ సినిమా మే 9న విడుదల కానుంది.