TG: నిర్మల్ జిల్లాలో కుబీర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అల్లుడు-కూతురు మధ్య విభేదాలు రావడంతో మనస్థాపం చెంది నీలకంఠం గోవింద్(64) అనే వ్యక్తి శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఏ. కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గోవింద్‌కు ఒక కూతురు ఉంది. అల్లుడు, కూతురు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవింద్ తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.