TG: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మహిళలు, పాత అపార్ట్‌మెంట్ల స్టాంప్ డ్యూటీ తగ్గింపు అంశాన్ని సీఎం రేవంత్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.