వర్షాకాలంలో వ్యాధులకు ఇలా చెక్ పెట్టెయ్యొచ్చు

64చూసినవారు
వర్షాకాలంలో వ్యాధులకు ఇలా చెక్ పెట్టెయ్యొచ్చు
వర్షాకాలంలో అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే బెల్లం, మిరియాలు కలిపి తీసుకుంటే ఈ సీజన్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మిరియాలు, బెల్లం కలిపి తింటే జలుబు, దగ్గు సమస్యల నుంచి దూరం కావొచ్చు. గొంతు నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. బెల్లం, నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్