APలో అపచారం చోటు చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో తల వెంట్రుకలు దర్శనమిచ్చాయి. ఓ భక్తుడు తాను కొన్న ప్రసాదంలో వెంట్రుకలు ఉండటం గమనించాడు. వెంటనే వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియా వేదికగా మంత్రులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పందించారు. ‘భక్తుడికి క్షమాపణ చెప్పారు. ఇంకోసారి తప్పు జరగకుండా చూస్తాను’ అని అన్నారు.