భారతదేశంలో మొదటి డిస్నీలాండ్ థీమ్ పార్క్‌ను హర్యానా గురుగ్రామ్‌లో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. మానేసర్ పచ్గావ్ చౌక్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇది పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.