శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

67చూసినవారు
AP: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఇవాళ విద్యుత్ తీగలు మార్చే క్రమంలో గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ తీగలపై వేలాడుతూ.. కొన ఊపిరితో ఉన్న కృష్ణను సహచర సిబ్బంది కిందకు దించారు. హుటాహుటిన శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్