కాంగ్రెస్‌లో అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి వివేక్ వంటి నాయకులు..ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమై బుజ్జగించారు. అసంతృప్త నాయకులకు ముఖ్యమైన పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎల్పీ సమావేశాలు జరిగాయి. అయినా కొందరు నాయకులు రాజీనామా బెదిరింపులు చేస్తునే ఉన్నారు.