TG: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2-9 వరకు రాజీవ్ యువ వికాసం అనుమతి పత్రాలు పంపిణీ చేస్తామని Dy. CM భట్టి విక్రమార్క అన్నారు. సన్న బియ్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతి ఏటా రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సన్న బియ్యంతో ₹3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సన్నధాన్యం బోనస్ కు ₹2,675 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.