TG: రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.సిరిసిల్లలో పవర్ లూం మీద చీరలు తయారు చేయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ రూ.318 కోట్లు విడుదల చేసింది. ఈ చీరలు సెప్టెంబర్ చివరి కల్లా రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ దసరాకు మహిళలకు చీరలను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.