ఈ ఏడాది దీపావళి పండుగ రేపా? ఎల్లుండా? అనే సందిగ్ధం ప్రజల్లో నెలకొంది. అశ్వీయుజ అమవాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అమవాస్య ఘడియలు అక్టోబర్ 31న మ.3.52 నిమిషాల నుంచి నవంబర్ 1న సా.6.16 నిమిషాల వరకు ఉంది. పండితులు చెప్పిన దాని ప్రకారం..
* రేపు సా 5.36 నుంచి 6.16 వరకు లక్ష్మి పూజ చేసుకోవచ్చు
* ప్రతిరోజు పితృ దేవతలకు తర్పణాలు వదిలేవారు ఎల్లుండి చేసుకోవాలి
* అలాంటి నియమాలు లేని వారు రేపు పండుగ చేసుకోవచ్చు