అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 47 మందిని గుర్తించగా.. 24 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.