జియో తన యూజర్ల కోసం అదిరిపోయే ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వరకు నెలకు రూ.349 ప్లాన్ రీఛార్జి చేసే వారికే ఉచితంగా అన్ లిమిటెడ్ 5జీ డేటా అందేది. అయితే తాజాగా తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికీ కూడా ఇది వర్తించేలా కొత్త వోచర్‌ను జియో అందుబాటులోకి తెచ్చింది. అదెలాగంటే రూ.601తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా ఉచితంగా 5జీ డేటా పొందవచ్చని తెలిపింది. వివరాలకు సమీప జియో స్టోర్‌ను సంప్రదించవచ్చు.