దోమల నివారణకు ఇలా చేయండి.. ప్రభుత్వం కీలక సూచనలు

9చూసినవారు
దోమల నివారణకు ఇలా చేయండి.. ప్రభుత్వం కీలక సూచనలు
TG: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంకులు మూతలు పెట్టి ఉంచాలి. పూల కుండీల కింద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడకంలోలేని టైర్లు, పనిముట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉంచొద్దు. వీటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా రాకుండా నివారించవచ్చని పేర్కొంది.

సంబంధిత పోస్ట్