ప్రస్తుతం అనవసరమైన సమాచారం కోసం ఫోన్లు చూస్తుండటం వల్ల "డూమ్ స్క్రోలింగ్" అనే అలవాటు పెరుగుతోంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల వార్తలు మనసును కుంగదీస్తాయి. ఆందోళన, నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తాయి. దీన్ని తగ్గించాలంటే ఫోన్ వాడకానికి టైమ్ లిమిట్ పెట్టాలి. ఉపయోగకరమైన సమాచారం, స్ఫూర్తిదాయక విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి.