పాలల్లో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుందని అంటున్నారు. పాలలో ప్రోటీన్, తేనెలో సహజమైన చక్కెర ఉండటంతో ఇది ఆకలి నియంత్రణ చేస్తుంది. తేనెలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు కొవ్వును నియంత్రించి, శరీర బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. రోజూ తేనె కలిపిన పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలు, తేనెను కలిపి తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.