ఖర్జూర తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటామని చెబుతారు. దీనిలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. అతిగా తింటే శరీరానికి హాని కూడా చేస్తాయి. ఊబకాయం ఉన్నవారు ఖర్జూర తింటే బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అతిగా తింటే డైజేషన్ సిస్టం పాడుచేస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా తింటే దురద రావడం వంటి సమస్యలు వస్తాయి.