చికెన్, మటనే కంటే చాలా మంది చేపలు తినడం ఇష్టపడుతుంటారు. అయితే చేప తల తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చేప తలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయట. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని తెలుపుతున్నారు. అలాగే చేప తలలో విటమిన్ ఎ, డి, బి12 వంటి విటమిన్లు ఉండడం వల్ల చర్మంతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు.