పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా పాలకూర తీసుకుంటే బరువు తగ్గొచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు పాలకూరను కచ్చితంగా తీసుకోవాలి. ఇందులోని ఐరన్ ఆ సమస్యకు చెక్ పెడుతుంది. అంతేకాదు పాలకూర తింటే.. క్యాన్సర్ కారకాలు పెరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు. దీర్ఘకాలంలో వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.