మహిళల కోసం ఉన్న హక్కుల గురించి తెలుసా?

22448చూసినవారు
మహిళల కోసం ఉన్న హక్కుల గురించి తెలుసా?
-ఒక మహిళ ఏదైనా పోలీసు స్టేషన్‌లో లేదా ఎక్కడి నుంచైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు.
-పని చేసే మహిళకు పురుషుడితో పాటు సమానంగా జీతం పొందే హక్కు ఉంది.
-మహిళలు గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది.
-ఒక మహిళ కార్యాలయంలో శారీరక వేధింపులకు లేదా లైంగిక వేధింపులకు గురైతే, ఫిర్యాదు చేసే హక్కు ఉంది. అంతర్గత ఫిర్యాదుల కమిటీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.
-భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 498 ప్రకారం గృహకు వ్యతిరేకంగా పోరాడే హక్కును కల్పించింది. ఇందులో నేరం రుజువైతే నిందితుడికి మూడేళ్ల నాన్ బెయిలబుల్ జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.
-గోప్యతను కాపాడే హక్కు: ఒక మహిళ లైంగిక వేధింపులకు గురైనట్లయితే ఆమె జిల్లా మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. ఒక మహిళ పోలీసు అధికారి సమక్షంలో వాంగ్మూలం ఇవ్వవచ్చు.
-ఉచిత న్యాయ సహాయ హక్కు: లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం ప్రకారం అత్యాచార బాధితురాలికి ఉచిత న్యాయ సలహా పొందే హక్కు ఉంది.
-రాత్రిపూట మహిళను అరెస్టు అరెస్టు చేయకూడదు.
- ఏ స్త్రీ అయినా తన ఫిర్యాదును వర్చువల్ పద్ధతిలో నమోదు చేసుకునే హక్కు కలిగి ఉంది.
-ఏ మహిళైనాన అసభ్యకరంగా, కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అలా చేయడం శిక్షార్హమైన నేరం.
-ఏపీసీ సెక్షన్ 354 డి ప్రకారం ఒక మహిళ తిరస్కరించినా కూడా పదే పదే వెంబడించడం, లేదా ఇంటర్నెట్, ఈమెయిల్ వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పర్యవేక్షించడం నేరం.

సంబంధిత పోస్ట్