మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికి కెంతో మేలని నిపుణులు చెబుతున్నారు. క్యాలరీలు అధికంగా తీసుకుంటే బరువు పెరగడం సహజం. అయితే మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఉన్న ప్రోటీన్, ఫైబర్‌లను వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది.