ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలో తెలుసా?

85చూసినవారు
ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలో తెలుసా?
దేశంలో ఒక్కో మనిషి ఏడాదికి సగటున 23.5 లీటర్ల వంటనూనె వినియోగిస్తున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ICMR సిఫార్సుల ప్రకారం ఒక మనిషికి రోజుకు 4 టేబుల్ స్పూన్లు అంటే 20 మి.లీ మించి నూనె వాడకూడదు. అంటే నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు కనిష్ఠంగా 2.5 లీటర్లు, గరిష్ఠంగా 4 లీటర్లకు మించి నూనెను వినియోగించకూడదు. ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువైతే ఒబెసిటీ, గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్