ఇప్పటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో శబ్ధాలు సృష్టించడం సులభమే కానీ గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. డిస్నీ కార్టూన్ కోసం శబ్ధాలు ఎలా సృష్టించారో చూపించే ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తగిన శబ్ధాలు అందించేందుకు వివిధ వస్తువులను వినియోగించి, తెరపై జరిగే చర్యకు సరిపడే శబ్ధాలను రూపొందించారు. ట్రైన్ కార్టూన్ కోసం వారు చేసిన కృషి పై వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.