గోమతి చక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే నాగచక్రం, విష్ణుచక్రం" అని కూడా అంటారు. ఈ చక్రాలు గుజరాత్‌లోని గోమతి నదిలో కనిపించే అరుదైన, సహజంగా ఏర్పడే నత్త ఆకారపు షెల్. వీటిని లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. పురాణాల ప్రకారం విష్ణువు ఈ గోమతీ చక్రాలను ఉపయోగించి శంఖచూడు అనే రాక్షసుడిని చంపాడు. అమరత్వం వరం కలిగి ఉన్న శంఖచూడుని మరణం సుదర్శన చక్రం ద్వారా మాత్రమే వస్తుంది.