రాత్రిపూట ఆలస్యంగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి 2-3 గంటల ముందు రాత్రి భోజనం తినడం ఉత్తమమని అంటున్నారు. ఆలస్యంగా తింటే స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. హృదయ సంబంధిత ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జీవక్రియ నెమ్మదించేందుకు, శరీరంలో ఎక్కువ కొవ్వు నిల్వ అయ్యేందుకు దారి తీస్తుంది. రాత్రి వేళ ఆలస్యంగా తినడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్ల ప్రభావం తగ్గి, అతిగా తినేలా చేస్తుంది.