అణు బాంబు దాడి జరిగితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పేలుడు సమయంలో అణుబాంబు అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. దాని పేలుడు తరంగం, వేడి, రేడియేషన్‌తో పాటు అనేక నష్టాలను కలిగిస్తుంది. దీని వలన విడుదలయ్యే వేడి, రేడియేషన్‌కు భూమిపై మానవులు, జీవరాసులు పూర్తిగా నశించిపోతాయి. వాతావరణం పూర్తిగా కలుషితమైపోతుంది. అలాగే అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే భూమిపై ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.