లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ నిత్యం మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. బయట నుంచి వచ్చిన సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేసి శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. కానీ లూపస్ వ్యాధిలో మాత్రం రోగనిరోధక వ్యవస్థ సొంత శరీర కణజాలంపై దాడి చేస్తుంది. సాధారణంగా సూక్ష్మక్రిములను నాశనం చేసే యాంటీబాడీలు లూపస్‌లో శరీరంలోని చర్మం, కీళ్ళు, అవయవాలను దెబ్బతీస్తాయి. అందుకే ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా చెప్పుకుంటారు.