శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి, అవయవాలు, ఆలోచనల మీద పట్టు సాధించడమే మైండ్‌ఫుల్‌నెస్. ఫలితాన్ని స్వీకరించి ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు మీద అవగాహనతో జీవించడమూ మైండ్‌ఫుల్‌నెస్సే. మైండ్‌ఫుల్‌నెస్‌ని సాధన చేస్తే ఒత్తిడి, ఆందోళన, అనవసరపు మానసిక సమస్యలకు తావుండదు. భావోద్వేగాలను అదుపులో ఉంచడం తేలికవుతుంది. చుట్టూ ఉండే పరిస్థితుల మీద పట్టు సాధించవచ్చు.