సంతార అనగా జైన మతంలో గంభీరమైన ఆమరణ నిరాహార దీక్ష. దీనినే సల్లేఖన, సమాధి మారన్‌గా కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి క్రమంగా ఆహారం, నీటిని వదులుకుని ఆధ్యాత్మిక నిర్లిప్తతతో మరణాన్ని స్వీకరించే ప్రక్రియ. ఇలా చేస్తే కర్మ నుండి ఆత్మను శుద్ధి చేసి.. భౌతిక ప్రపంచం నుండి విముక్తి కలిగిస్తుందని జైనుల నమ్మకం. సాధారణంగా వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు, మరణం సమీపిస్తున్నప్పుడు ఈ దీక్ష చేపడతారు.