సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలా కృష్ణ, శుక్ల పక్షాలల్లో ఒక్కోక్కటి వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని "తొలి ఏకాదశి" లేదా "శయన ఏకాదశి" అంటారు. "ఏకాదశి" అంటే పదకొండు.. ఐదు జ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం), ఐదు కర్మేంద్రియాలు (చేతులు, కాళ్ళు, నోరు, పాయువు, జననేంద్రియాలు), వాటిని నడిపించే మనస్సు. ఈ పదకొండు ఏకాగ్రంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఈ రోజు విష్ణువును పూజించి, ఉపవాసం చేస్తారు.