టీ షర్ట్‌లో టీ అంటే ఏంటో చాలామందికి తెలియదు. కానీ ఆ టీ వెనుక ఒక చిన్న స్టోరీ ఉందట. నిపుణుల అభిప్రాయం ప్రకారం, T- షర్టులో T అనే పదం అర్థం రెండు విధాలుగా వచ్చిదట. T- షర్టు ఆకారం T లా ఉంటుంది. దీనిని ముందు లేదా వెనుక నుంచి చూస్తే, T ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి టీ-షర్ట్ అని పేరొచ్చిందట. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సైనికులు శిక్షణ సమయంలో చాలా తేలికపాటి బట్టలు ధరించేవారు. వాటిని ట్రైనింగ్ షర్ట్స్ అని పిలిచేవారట.