2012లో శాస్త్రవేత్తలు మెక్సికో ఎడారిలో బోయింగ్ 727 విమానాన్ని రిమోట్ ద్వారా భూమికి ఢీకొట్టి పరీక్ష చేశారు. ఫలితంగా కాక్‌పిట్‌తో సహా ముందు భాగం ఎక్కువగా నష్టపోయాయని గుర్తించారు. రెక్కల దగ్గర సీట్లలో కూర్చుంటే తీవ్ర గాయాలవుతాయని, విమానం వెనక భాగంలోని సీట్లలో కూర్చొవడం సురక్షితమని, తద్వారా సేఫ్‌గా బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉందని గుర్తించారు.