దేశంలో ఎక్కడెక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతాయో తెలుసా..?

80చూసినవారు
దేశంలో ఎక్కడెక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతాయో తెలుసా..?
సరస్వతీ నది ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలోని 'మన' అనే గ్రామంలో ఉద్భవించి, భూగర్భంలో ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది అంతర్వాహినిగా పిలువబడుతుంది. అలాగే సరస్వతి నది.. అలకనంద నదికి ఉపనదిగా కేశవ ప్రయాగ వద్ద కలుస్తుంది. అందువల్ల సరస్వతీ నదీ పుష్కరాలు 'మన' అనే గ్రామంలో జరుగుతాయి. అలాగే ప్రయాగ్‌రాజ్, సోమనాథ్, పుష్కర్‌లలోని త్రివేణీ సంగమాల్లో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా పుష్కరాలు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్