ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎడమవైపు తిరిగి పడుకుంటే వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా గర్భిణులు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల పిండానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. గురక సమస్య తగ్గాలంటే కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శ్వాస తీసుకోవడం సులభమవుతుందట.