కిడ్నీ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి డయాలసిస్ చేస్తారు. అధిక రక్తపోటు, మధుమేహం, లూపస్ వంటి సమస్యలు ఉన్నవారికి కిడ్నీలు త్వరగా దెబ్బతింటాయి. ఇది కిడ్నీ వ్యాధికి కారణమవుతుంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు జీవించడానికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం. సరైన కిడ్నీ అందుబాటులో ఉంటేనే కిడ్నీ మార్పిడి చేస్తారు. లేదంటే రోగులకు డయాలసిస్ ఒక్కటే పరిష్కారం.